జగన్ కు 20 కేజీల లడ్డూ బహూకరణ

వైసీపీ అధినేత జగన్ కు ఓ విశిష్ట కానుక అందింది. విశాఖపట్నం గాజువాక గణేశ్ ఉత్సవ కమిటీ జగన్ కు 20 కేజీల లడ్డూను బహూకరించింది. ఇవాళ తాడేపల్లి వచ్చిన గాజువాక గణేశ్ ఉత్సవ కమిటీ సభ్యులు జగన్ కు వినాయకుడి లడ్డూ ప్రసాదాన్ని అందించారు. ఈ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గాజువాకలో 89 అడుగుల మహా గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.

కాగా, ఇవాళ జగన్ ను కలిసి భారీ లడ్డూ అందించిన వారిలో వైసీపీ కార్పొరేటర్ తిప్పల వంశీరెడ్డి, విద్యార్థి విభాగం నేత జిలకర్ర నాగేంద్ర, గణేశ్ ఉత్సవ కమిటీ చైర్మన్ కోసిరెడ్డి గణేశ్ తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా జగన్ వారిని సత్కరించారు.

Laddu
Jagan
Gajuwaka Ganesh Utsava Committee
Visakhapatnam
YSRCP

More Telugu News